10 July, 2026 | 5:36 AM

గూగుల్ వ్యాలెట్ యాప్ విడుదల

09-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 8: ఇండియాలో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’యాప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. ఈ యాప్‌లో వినియోగదారులు వారి బోర్డింగ్ పాస్‌లను, లాయల్టీ కార్డులను, ఈవెంట్ టిక్కెట్లను, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పాసులను భద్రపర్చుకోవచ్చు. బుధవారం నుంచి ఇండియాలో ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని, పేమెంట్ యాప్ ‘గూగుల్ పే’కు కాంప్లిమెంటరీ సర్వీసుగా ఇది లభిస్తుందని గూగుల్ అధికారి ఒకరు తెలిపారు. గూగుల్ పే తమ పేమెంట్ యాప్‌కాగా, గూగుల్ వ్యాలెట్ నాన్ అవసరాల కోసమని గూగుల్ ఇండియా ఇంజనీరింగ్ లీడ్, జీఎం రామ్ పాపట్ల వివరించారు. కొత్త సర్వీసు కోసం ఎయిర్ ఇండియా, ఇండిగో, ఫ్లిప్‌కార్ట్, కొచ్ఛి మెట్రో, పీవీఆర్, ఐనాక్స్ తదితర 20 భారత బ్రాండ్లతో గూగుల్ టైఅప్ చేసుకున్నది. రానున్న నెలల్లో మరిన్ని బ్రాండ్లతో టైఅప్ చేసుకుంటామని రామ్ తెలిపారు. గూగుల్ వ్యాలెట్ ప్రస్తుతం 80 దేశాల్లో లభిస్తున్నది.