10 July, 2026 | 4:41 AM

ఇండెజెన్ ఐపీవోకు భారీ స్పందన

09-05-2024 12:05 AM

ముంబై, మే 8: డిజిటల్ సర్వీసుల్ని అందించే ఇండెజెన్ జారీచేసిన ఐపీవోకు భారీ స్పందన లభించింది. ఆఫర్ ముగింపు రోజైన బుధవారం నాటికి 69 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రూ.1,842 కోట్ల సమీకరణకు జారీచేసిన ఐపీవోకు రూ.430 ప్రైస్‌బ్యాండ్‌ను కంపెనీ నిర్ణయించింది. ఆఫర్‌లో రూ.750 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో కొంత వాటాను విక్రయిస్తున్నారు. కంపెనీ ఐపీవోలో 2.89 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తుండగా, 202 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 197 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 8 రెట్ల స్పందన లభించింది.  తాజా ఈక్విటీ ఇష్యూ ద్వారా సేకరించే నిధుల్ని కంపెనీ రుణాల చెల్లింపునకు, మూలధన వ్యయాకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వాడుకుంటుంది.