బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు పోచారం, ఆగ్రో చైర్మన్ కాసుల
28-05-2026 05:38 PM
బాన్సువాడ, మే 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఈదుగా వద్ద గురువారం బక్రీద్ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ ఈద్ ముభారక్ ( బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ) ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు తెలిపారు.ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు.






