12 March, 2026 | 8:12 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు

19-06-2025 12:00 AM

గద్వాల్ టౌన్ జూన్ 18 : ప్రవేట్ కార్పొరేటర్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య ను అందిచడం జరుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డి ప్రభుత్వం జూనియర్ కళాశాల కోఎడ్యుకేషన్ ప్రభుత్వం బాలికల కళాశాలలో విద్యార్థినీలకు ప్రభుత్వం తరుపున వచ్చిన పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే అందచేశారు.

అనంతరం ఇటీవలే 900 పైగా ఫలితాలు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతిని అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కార్పొరేటర్ కళాశాలకు దీటుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కళాశాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి నోడల్ ఆఫీసర్ హృదయ రాజ్,ప్రభుత్వ జూనియర్ కళాశాల మహిళ కళాశాల ప్రిన్సిపల్,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.