4 April, 2026 | 2:16 AM

డంప్ యార్డు.. కాలుష్య కాసారం

04-04-2026 12:39 AM

హుజరాబాద్ లో వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిర్ణయం

వ్యతిరేకిస్తున్న హుజురాబాద్ ప్రజలు

హుజురాబాద్,ఏప్రిల్ 3: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా వజ్రాల మండలం సిర్సపల్లి గ్రామ శివారులోని చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయనున్న డంపు యార్డ్ ప్రాజెక్టు ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి బహిరంగ సభలో ఔటర్ రింగ్ రోడ్డు చేస్తూ కరీంనగర్, వరంగల్ సిటీ లను ట్రైసిటీలుగా చేస్తూ కరీంనగర్, వరంగల్ జిల్లాల మధ్యలోమధ్యలో ఒక ప్రాజెక్టు తీసుకువస్తానని ముఖ్యమంత్రి తెలపడంతో ప్రభుత్వం టెండర్లను పిలిచింది. అది గమనించిన హుజురాబాద్ ప్రజలు ఇక్కడ ప్రాజెక్టు ఏర్పడితే మనోమనగడ కష్టంగా మారుతుందని అఖిలపక్షంగా ఏర్పడి డంప్యాడ్ రద్దు చేయాలని 12 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఇప్ప టికే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ కి డంపింగ్ యార్డ్ రద్దు చేయాలనివినతిపత్రం అందజేశారు.

హుజరాబాద్ ము న్సిపాలిటీ తో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. అసెంబ్లీలో కూడా ఎ మ్మెల్యే పాడి కౌశివరెడ్డి డంప్యాడ్ రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారికి అనుకొని ఉన్న 25 ఎకరాల స్థలంలో వెస్ట్ ఎనర్జీ ప్లాట్ నిర్మాణానికి 20 22లో బీజం పడింది.

రెండు కార్పొరేషన్లు 9 మున్సిపాలిటీల నుంచి 800 టన్నులపై చిలుకు వ్యర్ధాలు ఉత్పత్తి ఉన్నట్లు తెలుస్తుంది. వందల టన్నుల చెత్తను కాల్చి ఇతర పద్ధతుల ద్వారా శుద్ధి చేయడంతో పర్యావరణం పూర్తిగా ధ్వంసం అవుతుందని హుజురాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 వార్డులను హుజురాబాద్ పట్టణ చెత్తను కలిస్తేనే చుట్టూ కిలోమీటర్ మేర భరించలేక కంపు, పొగ ఉత్పన్నమవుతున్నాయని ఇక ఈడ ప్రాజెక్టు ఏర్పడితే మానవ మనుగడ ప్రశ్నార్థకమే అవుతుందని ఆందోళన చెందుతున్నారు.

నేను బతికున్నంత వరకు డంపింగ్ యార్డ్ కానివ్వ

నేను బతికున్నంత వరకు హుజరాబాద్ లో డంపియార్డును నిర్మాణం చేపట్టనివ్వ. దేనికైనావ్ సిద్ధంగా ఉన్నా. తెలిపారు. చెత్త ద్వారావిద్యుత్ ఉత్పత్తి చేస్తే విషవాయులు వెలువడి పంట పొలాలు, ప్రజలకు హాని కలుగుతుంది. ప్రభుత్వంకి నాపై కోపం ఉంటే నన్ను జైలుకు పంపండి తప్ప నా హుజురాబాద్ ప్రజలపై కక్ష సాధించవద్దు.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మంత్రికి తీర్మానం చేసి పంపాము

డంప్ యార్డ్ రద్దుకు నా వంతు కృషి చేస్తా. ఇప్పటికే మా పాలకవ ర్గం రద్దు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చే సాం. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తా. అఖిలపక్ష కమి టీ తీసుకునే నిర్ణయాలలో పాలుపంచుకుంటా.

రొంటాల సుహాసిని మున్సిపల్ చైర్‌పర్సన్ హుజురాబాద్

పంట పొలాలపై ప్రభావం

 డంప్ యార్డు వల్ల సమీప గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. దీని ప్రభావం పంట పొలాలపైనా ఉంటుంది. ఫలితంగా దిగుబడి పడిపోతుంది. భూసారం తగ్గి కొన్నేండ్లకు పంటలు పండే పరిస్థితి ఉండదు. ప్రమాదకరమైన వాయువులు వెలువడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. చెత్తను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.

పలకల ఈశ్వర్ రెడ్డి, అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్

వెంటనే రద్దు చేయాలి

 గ్రామపరిధిలో ఏర్పాటు చేయాలనుకుంటున్న డంప్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎనర్జీ ప్లాంట్ నుంచి వెలువడే విష వాయువులతో మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలి. డంపు యార్డు రద్దు చేసేంతవరకు పోరాడుతాం.

కటుకూరి మల్లారెడ్డి రాజ పల్లి సర్పంచ్ సిర్సపల్లి