13 July, 2026 | 9:34 AM

ఫతేపూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

13-07-2026 09:02 AM

సిర్గాపూర్ జులై 13(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని ఫతేపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కల్హేర్ ఎస్సై రవి గౌడ్ సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పలువురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నగదు 16130/-, పది సెల్‌ఫోన్లు, ఆటకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కల్హేర్ ఎస్సై రవి గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.