13 July, 2026 | 3:15 AM

స్మార్ట్ సాగు!

13-07-2026 02:27 AM

డిజిటల్ వ్యవసాయం దిశగా కేంద్రం అడుగులు

  1. సాంకేతికతతోనే విత్తనం నుంచి మార్కెటింగ్
  2. పంట ఉత్పత్తుల అంచనా, తెగుళ్ల గుర్తింపు, నివారణకు ఏఐ ఎరువులు, పురుగు మందుల వాడకానికి కూడా..
  3. రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం దేశవ్యాప్తంగా 7.63 కోట్లకు పైగా రైతు ఐడీలు నమోదు
  4. 25.3 కోట్ల ఎకరాల సాగు భూముల సర్వే

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : వ్యవసాయ రంగం డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికత లు సాగు విధానాల్లో కీలక మార్పులకు దారితీస్తున్నాయి. ఉత్పాదకతను పెంచడం, వనరుల వినియో గాన్ని తగ్గించడం, పంట నష్టాలను ముందుగానే అంచనా వేయడం వంటి అంశాల్లో ఏఐ రైతులకు అండగా నిలుస్తోంది. ఉపగ్రహ చిత్రాలు, సెన్సార్లు, డ్రోన్లు, వాతావరణ కేంద్రాలు, వ్యవసాయ యంత్రా ల నుంచి సేకరించే సమాచారాన్ని విశ్లేషించి..

ఏఐ వ్యవస్థలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా రైతుల వివరాలతో ప్రత్యేక డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయగా.. 7.63 కోట్లకు పైగా రైతు ఐడీలు నమోదయ్యాయి. అలాగే 23.5 కోట్ల ఎకరాలకు పైగా పంట భూములపై సర్వే నిర్వహించారు.

రైతు ముంగిటకు సాగు సమాచారం..

కేంద్ర బడ్జెట్ 2026 ప్రతిపాదించిన ‘భారత్-విస్తార్’ అనే ఏఐ పరికరం వ్యవసాయ సమాచా రాన్ని మరింత సులభంగా రైతులకు అందించేందుకు ఉపయోగపడనుంది. ఇది అగ్రిస్టాక్ పోర్టళ్లు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సమాచారాన్ని ఏఐ వ్యవస్థతో అనుసంధానం చేస్తుంది. వేగవంతమైన వృద్ధి, ఏఐ ప్రతిభ, పెట్టుబడులను ప్రతిబింబిస్తుండటంతో ఇప్పుడు ప్రపంచ లోనే భారతదేశం మూడో స్థానంలో నిలిచిందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం దీనికి కారణంగా నిలుస్తున్నాయి.

జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ 66రకాల పంటలు, 432కు పైగా రకాల తెగుళ్లను గుర్తించింది. తెగుళ్లను ముందుగానే గుర్తించడంతో పాటు 10 వేల మందికి వ్యవసాయ విస్తరణ అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలను అందిస్తుంది. అంతే కాకుండా రుతుపవనాల రాకను అంచనా వేస్తోంది. గత వానాకాలం సీజన్‌లో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ 13 రాష్ట్రాల్లోని 3.88 కోట్ల మంది రైతులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. సర్వే చేసిన రైతులలో 31-.52 శాతం మంది ఈ అంచనాల ఆధారంగా విత్తనాలు వేయ డం, భూమిని సిద్ధం చేసుకోవడం వంటి నిర్ణయాలు మార్చుకున్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.   

నేల స్వభావం, తేమ శాతం, పంట ఆరోగ్యాన్ని పరీక్షించడం   

ఏఐ ఆధారిత వ్యవస్థలు శాటిలైట్ చిత్రా లు, డ్రోన్ల సాయంతో నేల స్వభావం, తేమ శాతం, పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయి. దీనివల్ల ప్రయోగశాలకు వెళ్లి పరీక్షలు చేయించాల్సిన అవసరం లేకుండానే నేల సారం, పోషక లోపాలను గుర్తించవచ్చు. రైతులు తక్షణమే నేలసారం పెంచే చర్యలు తీసుకోవడానికి అస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రైతులు ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంత ఎరువులు వాడాలి, ఎప్పుడు కోత కోయాలి అనే విషయాల్లో ఏఐ సహాయం చేస్తుంది.

తెగుళ్ల గురించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం నుంచి నీటి పారుదల ప్రణాళిక వరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాతావరణ డేటాను విశ్లేషించి వర్షపాతం, ఉష్ణోగ్రత మార్పులను ముందుగానే పసిగడుతుంది. శాటిలైట్లు, డ్రోన్ల సాయంతో తెగుళ్లను ముందుగానే గుర్తిస్తుంది. దీనివల్ల నీరు, ఎరువులు, పురుగుమందులను ఎక్కడ, ఎప్పుడు, ఎంత అవసరమో అంతే వాడేలా చేస్తుంది. ఈ విధానం వల్ల దిగుబడి పెరగడమే కాకుండా, వనరుల వృథా తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది.  

మార్కెట్ సమాచారంలోనూ ఏఐ తోడ్పాటు

పంటలకు సరైన ధరలు పొందడంలో మార్కెట్ సమాచారం కీలకం. ఏఐ ఆధారిత వ్యవస్థలు మార్కెట్ డిమాండ్, సరఫరా పరిస్థితులను విశ్లేషించి రైతులకు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.  దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలను విశ్లేషించడం ద్వారా ఏ పంటకు డిమాండ్ ఉంది? ఎప్పుడు విక్రయిస్తే మంచి ధర వస్తుంది? ఏ మార్కెట్‌ను ఎంచుకోవాలి? వంటి అంశాల్లో రైతులకు సహాయం అందుతోంది.

ప్రస్తుతం ఏఐ ఆధారిత వ్యవసాయ వ్యవస్థలు 12 రాష్ట్రాల్లోని సుమారు 18 లక్షల మంది రైతులకు మార్కెట్ ధరల సమాచారం, సరఫరా గొలుసు నిర్వహణలో సహకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. డిజిటల్ సాంకేతికత, కత్రిమ మేధ కలయికతో వ్యవసాయం మరింత ఆధునికంగా మారుతోంది. భవిష్యత్తులో రైతు నిర్ణయాలకు డేటా ఆధారిత వ్యవస్థలు మరింత కీలకంగా మారనున్నాయి.  

వ్యవసాయ యంత్రీకరణకు కొత్త శక్తి

డ్రోన్లు, సెన్సార్లు, ఏఐ ఆధారిత పరికరాలు వ్యవసాయ యంత్రాల సామర్థ్యాన్ని పెంచుతాయి. కలుపు తొలగింపు, తెగుళ్ల గుర్తింపు, ఆటోమేటిక్ కోతలు, పంటల గ్రేడింగ్ వంటి పనులు మరింత సులభతరం చేస్తాయి. తోటల సాగులో ఏఐ ఆధారిత వ్యవస్థలు 24 గంటల పాటు పంటలను పర్యవేక్షించగలగడంతో కూలీలపై ఆధారపడటం తగ్గి, నాణ్యత పెరుగుతోంది.   తోటల పెంపకంలో ఏఐ ఆధారిత వ్యవస్థలు పంటలను 24 గంటలూ పర్యవేక్షించడం ద్వారా కూలీల అవసరం తగ్గుతుంది.

పంట నాణ్య త పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు పండించే రైతులు సరైన మార్కెట్ సమాచారం లేక, సరఫరా గొలుసులో సమస్యలు, సమాచారలోపం వంటి కారణాలతో తక్కు వ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. మార్కెట్ డిమాండ్, సరఫరాను అంచనా వేయడం, మార్కెట్ ఇంటిలెజెన్స్, వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

దేశీయ, ప్రపంచవ్యాప్త వస్తువుల సంకేతాలను విశ్లేషించడంతో పాటు  పంట ఎంపిక, విక్రయ సమయం, మార్కెట్ ఎంపికపై మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకో వడానికి అవకాశం ఉంటుందని, తద్వారా రైతులకు మంచి ధర లభించేలా చేస్తుంది. ప్రస్తుతం  ఏఐ-ఆధారిత వ్యవసాయ వ్యవస్థలు 12 రాష్ట్రాల్లోని సుమారు 18 లక్షల మంది రైతులకు మార్కెట్, ధరను గుర్తించడంతో పాటు  రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.