12 March, 2026 | 3:47 AM

జర్న లిస్టులకూ ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్!

12-03-2026 02:03 AM
  1. సీఎంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం

టీడబ్ల్యూజేఎఫ్ నాయకులతో మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకూ వర్తింపజేసే అంశంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చిం చి సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ తెలిపారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత అంశం ప్రభు త్వ దృష్టిలో ఉందని, ప్రజల ఆరోగ్య సం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రా ధాన్యత ఇస్తోందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అమలు చేస్తున్న హె ల్త్ స్కీమ్‌ను జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అమలు చేయాలని కోరుతూ టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు ఈమేరకు బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మం త్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు టీడబ్ల్యూజేఎఫ్ ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు బీ.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు ఈ.చంద్రశేఖర్, బి.జగదీశ్వర్ ఉన్నారు.