28 June, 2026 | 3:45 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు

12-03-2026 02:04 AM

ఎల్లమ్మ గూడెం ఘటనపై నివేదిక ఇవ్వాలని ఎస్సీ కమిషన్ ఆదేశం

నల్లగొండ, మార్చి 11 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెంలో జరిగిన ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ బుధవారం కలెక్టర్, ఎస్పీలకు నోటీసు జారీ చేసింది. తన భూమిని ఆక్రమించుకుంటూ, హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని శ్రీనివాస్ అనే వ్యక్తి కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.

భూమి ఆక్రమణకు గురవుతుందని తగిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయడంతో హైదరాబాద్‌లోని కమిషనర్ సునీల్ కుమార్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. తీసుకున్న చర్యలపై కేసు, ఎఫ్‌ఐఆర్ సెక్షన్లు, నిందితుల అరెస్టు, ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం అందాల్సిన పరిహారం తదితర అంశాల గురించి 30 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని నోటిస్‌లో పేర్కొన్నారు.