వసతులకు నోచుకోని తహాసీల్దార్ కార్యాలయం
- నిత్యం అవస్థలు పడుతున్న కార్యాలయ సిబ్బంది, ప్రజలు
- సదాశివనగర్ తహాసీల్దార్ కార్యాలయంలో సమస్యలు మెండు
- బాత్రూం లేక, కూర్చునేందుకు స్థలము, కుర్చీలు లేక అవస్థలు పడుతున్న అధికారులు, ప్రజలు
సదాశివనగర్, జూలై 27 (విజయక్రాంతి): కనీస మౌలిక వసతులు లేక తహసిల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది, ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు సైతం కార్యాలయానికి వచ్చి కూర్చునేందుకు రూములు, ఫర్నిచర్, కూడా కనీస సౌకర్యాలు లేవు. అధికారులు సిబ్బంది ఆరకోర వసతుల మధ్య నిత్యం అవస్థలు పడుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించినప్పటికీ కొత్త భవనం మంజూరు కావడం లేదు. గత 30 సంవత్సరాల క్రితం ప్రతి మండలానికి ప్రభుత్వం త హాసిల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల ను అన్ని వసతులతో అప్పటి ప్రభుత్వం నిర్మించింది. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ తహాసిల్దార్ కార్యాలయం నూతనంగా నిర్మించిన భవనం ను ఆదిలోనే అప్పట్లో పీపుల్స్ వార్ నక్సలైట్లు ఢీ టో నేటర్లు పెట్టి పేల్చి వేశారు.
అప్పటినుంచి సమీపంలో ఉన్న ఓ పాత భవనంలో తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేకపోవడంతో పాటు మూత్రశాలలు కూడా లేవు. కూర్చునేందుకు కుర్చీలు సైతం వేసుకునే స్థలం లేదు. నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలను అందజేశారు.
ప్రజల ఇక్కట్లు
సదాశివ నగర్ తహాసిల్దార్ కార్యాలయానికి వివిధ గ్రామాల నుంచి సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలు చెట్ల కింద కూర్చుని అవస్థలు పడుతున్నారు. కార్యాలయంలో కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో తాసిల్దార్ కార్యాలయం ముందర చెట్ల కింద నీడ లో కూర్చుంటున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
సదాశివ నగర్ తాసిల్దార్ కార్యాలయం శిథిలావస్థలో పాత భవనంలో కొనసాగుతుంది. గతంలో కొత్త భవనం నిర్మాణం జరిగిన కొద్ది రోజుల్లోనే పేల్చివేశారు. కొత్త భవనం నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు నివేదించాం. అధికారులు సిబ్బంది ప్రజలు కార్యాలయం వచ్చేవారు ఇబ్బందులు పడు తున్నారు. కొత్త భవనం నిర్మించాలి.
- సత్యనారాయణ, తహసిల్దార్, సదాశివ నగర్, కామారెడ్డి జిల్లా






