28 July, 2026 | 2:01 AM

మరో జెన్‌జీ ఉద్యమం

28-07-2026 01:00 AM
  1. టార్గెట్ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ?
  2. ఆన్‌లైన్‌లో ‘ఈ 20 జనతా పార్టీ’ ఆవిర్భావం
  3. తనపై ప్రచారంపై కేంద్ర మంత్రి గడ్కరీ అభ్యంతరాలు
  4. బొంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు
  5. మెటా సహా సోషల్‌మీడియా సంస్థలపై సివిల్ దావాకు న్యాయస్థానం అనుమతి

న్యూఢిల్లీ, జూలై ౨౭: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు, విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఫలించి, శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సీజేపీ ఉద్యమం సాధించిన విజ యం తాజాగా మరో ఆన్‌లైన్ ఉద్యమానికి బాటలు వేసింది. సోషల్‌మీడియాలో ‘ఈ- 20 జనతా పార్టీ’ పేరుతో ఒక వినూత్నమైన వేదిక ఆవిర్భవించింది.

ఈ వేదికగా కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ మొదలైందనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన వివాదాస్పద ‘ఈ-20’ ఇంధన విధానానికి నిరసనగానే జెన్‌జీ ఈ ఉద్యమాన్నీ భుజానికి ఎత్తుకోబోతున్నదని ప్రచారం జరుగుతున్నది.

అసలేంటీ ఈ 2౦ విధానం?

20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలయికతో రూపొందే ‘ఈ- 20’ ఇంధనం పర్యావరణ హితమని, పెట్రోల్, డీజిల్ వినియోగంతో పోలిస్తే, ఈ-౨౦ వినియోగమే శ్రేయస్కరమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ వివాదాస్పద ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతోపాటు కేంద్రప్రభుత్వంలోని పెద్దలు ఈ ప్రతిపాదనను సమర్థించుకుంటూ వస్తున్నారు.

అయితే.. ప్రతిపాదనపై దేశవ్యాప్తం గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యం గా యువత ప్రతిపాదనను బలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఈ-౨౦ ఇంధన విని యోగంతో వాహనాల మైలేజీ తగ్గుతుందని, పాత వాహనాల ఇంజిన్లు త్వరగా పాడవుతాయని విమర్శకులు వాదిస్తున్నారు.

బొంబై కోర్టును ఆశ్రయించిన గడ్కరీ

సామాజిక మాధ్యమాల ద్వారా తనతోపాటు తన కుటుంబంపై జరుగుతున్న ప్రచా రాన్ని ఖండిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా బొంబై హైకోర్టును ఆశ్రయించారు. ‘ఈ-20’ ఇథనాల్ విధానం ద్వారా తాను లబ్ధిపొందినట్లు అసత్య ప్రచారం జరుగుతున్నదని, తనపై కొందరు డీప్‌ఫేక్ పోస్టులు పెడుతున్నారని న్యాయపోరాటానికి దిగారు. ఆ విధానం పూర్తిగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోనిదని, సదరు ప్రతిపాదనతో తనకు ఎలాంటి వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు లేవని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

పిటిషన్‌పై హైకోర్టు జస్టిస్ అభయ్ అహుజా సోమవారం విచారణ చేపట్టారు. గడ్కరీ తరఫున అడ్వొకేట్ సందీప్ ఎస్ లాడ్డా తన వాదనలు వినిపించిన అనంతరం న్యాయస్థానం స్పం దించింది. మెటా సహా అనేక సోషల్ మీడి యా వేదికలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై సివిల్ దావా వేసేందు అనుమతి మంజూరు చేసింది. 

నలుగురు ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్

కేంద్ర మంత్రి గడ్కరీకి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్న యూట్యూబర్ మనీష్ కశ్యప్, ‘దేశీ బాయ్స్’ ఇన్‌స్టాగ్రాం ఖాతా నిర్వాహకులు హర్షిత్ రాఠీ, అంకలేఖ్ ఇన్వా టేతో పాటు మరో యూట్యూబర్‌పై సోమవారం నాగ్‌పూర్‌లో ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి.