నాణ్యమైన విత్తనాలే వినియోగించాలి
విత్తన మేళా ప్రారంభంలో కలెక్టర్ హేమంత్
వంగూరు, జూలై 27: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల విత్తన మేళాను సోమవారం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేసి, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకుని నిపుణుల సూచనల మేరకు శాస్త్రీయ వ్యవసాయం చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ఈ విత్తన మేళా ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనుంది.






