1 July, 2026 | 10:20 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

హామీల అమలులో ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్

09-09-2024 01:09 AM

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 8: హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతురుణమాఫీని పూర్తిగా చేయకుండా పూటకోమాట మార్చుతూ రైతులను గందర గోళానికి గురి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 2014కు ముందు ఉన్న కరెంట్ కోతలు ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు.

సీఎం నుంచి మంత్రుల వరకు వ్యక్తిగత సంపాదన మీదే సోయి ఉన్నదని విమర్శించారు. వరదలతో లక్షలాది ఎకరాలలో పంట నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎటు వంటి సాయం అందించకపోవడం దుర దృష్టకరం అన్నారు. ప్రభుత్వ అస మర్థతో వరద బాధితులు బురదలోనే మగ్గుతు న్నారని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు.