09-09-2024 01:12:56 AM
ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): యోధుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమస్యల సాధన కోసం ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. అదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధర్యంలో ఏర్పాటు చేసిన కొమరంభీం, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆదివారం ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి జోగురామన్నలతో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరుకావడంతో కార్యక్రమంలో సందడి నెలకొంది.