30 May, 2026 | 10:34 AM

తడిసన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

30-05-2026 09:55 AM

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.  

ప్రజలకు  సేవలు అందించాలి.  కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వరి మొక్కజొన్న పంట తడిసి పోతుందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్పష్టం చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడది అత్యధికంగా మొక్కజొన్న సాగు(Maize Cultivation) అయిందని కొనుగోలు అనంతరం ధాన్యం తరలింపు భద్రపరిచేందుకు ఎదురైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని రైతులు దిగాలు చెందాల్సిన పని లేదన్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. 

ప్రజలకు ఆలస్యం లేకుండా మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. భూ భారతి, మ్యూటేషన్ కేసులు, ధాన్యం కొనుగోళ్లు, జనగణన, కొత్త రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి తదితర అంశాలపై సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, గన్ని బ్యాగులు, లారీలు ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. తడిసిన ధాన్యం వివరాలను వెంటనే తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూ భారతి, రెవెన్యూ, మ్యూటేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని తెలిపారు. జనగణన ప్రక్రియను ఖచ్చితంగా నిర్వహించాలని, సంక్షేమ పథకాల అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.