సత్తుపల్లిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు బయటికి తీయాలి
కలెక్టర్‌కు వినతి చేసిన సీపీఐ
సత్తుపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): సత్తుపల్లిలో వేశ్యకాంతల చెరువు మరియు ఇతర అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఐబి భూములు అన్యక్రాంతం చేసిన వారిపై చర్యలు తీసుకొని అట్టి భూములు బయటకు తీసి పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలకు పంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఖమ్మం జిల్లా కలెక్టర్కు పెద్ద పత్రం ఇచ్చినట్లు తెలిపారు.
సత్తుపల్లి రెవిన్యూ సర్వేనెంబర్ 13 సర్వేనెంబర్ 19 లో ప్రభుత్వ టీచర్ ఆక్రమించిన భూములు పై విచారణ జరపాలని వాటిని వెంటనే బయటికి తీయాలని వాటితో పాటు ఇంకా అనేక మంది ఆక్రమంలో వందలాది ఎకరాల భూములు అన్ని గ్రంధమై ఉన్నాయని వాటిని బయటికి తీసి పట్టణంలో వేలాదిమంది పేదలు ఇంటి స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఇళ్ల స్థలాలు ఇయ్యాలని ఖమ్మం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వటం జరిగిందని దండు తెలిపారు.
ప్రభుత్వం వీటిపై విచారణ జరుగుతుందని సత్తుపల్లి తాసిల్దార్ కు వెంటనే జిల్లా కలెక్టర్ లెటర్ పంపారని అతి భూములు బయటకు తీస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు కరుణకుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు






