16 July, 2026 | 1:09 AM

ప్రజలకు అందుబాటులో సర్కార్ వైద్యం

23-07-2025 12:00 AM
  1.  వచ్చే జూలై నాటికి అందుబాటులో 50 పడకల ఆస్పత్రి
  2.  ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

ఇల్లంతకుంట ,జూలై22(విజయక్రాంతి): ప్రజలకు అందుబాటులో సర్కార్ వైద్యాన్ని ఉంచాలన్నదే కాంగ్రెస్ ప్రభు త్వ విధానమని మానకొండూ ర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో 12 కోట్లతో చేపట్టిన 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50 పడకల ఆస్పత్రి కోసం లేశమాత్రపు కృషి జరగలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత ప్రజలు వైద్యపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 50 పడకల ఆస్పత్రి కోసం గట్టి కృషి చేశామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఇల్లంతకుంట మండలంలో దూరంగా ఉండటంతో మెరుగైన వైద్యం పొందడంలో ఈ మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, 50 పడకలతో ఆస్పత్రిని నిర్మిస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అం దు తుందనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు సానుకూలంగా స్పందించారన్నారు.

ఆస్పత్రి నిర్మాణానికి 12 కోట్ల రూపాయలు, ఆ స్పత్రిలో వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు 5.50 లక్షలు వెరసి 17.50 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. త్వరలోనే ఆర్థికపరమైన అనుమతులు పొంది నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని, వచ్చే సంవత్సరం జూలై మాసంలో నూతన వైద్యశాల ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర వైద్యఆ రోగ్య శాఖ మంత్రితోనే ఈ వైద్యశాలకు ప్రారంభోత్సవం చేయిస్తామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం పదేళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను పరేషాన్ చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే కొత్త రేషన్ కార్డులను ఇస్తు న్నామని ఎమ్మెల్యే వివరించారు.

ఈ కార్యక్రమాల్లో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జ్యోతి, పార్టీ నాయకులు పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్, మాతంగి అనిల్, చిట్టి ఆనంద్ రెడ్డి, ఆకుల సత్యం, యాదవ రెడ్డి, పల్లె రాజశేఖర్, తీగల పుష్పలత, కె. మల్లేశం తదితరులు పాల్గొన్నారు. బొల్లవేణి రామేశ్వర్లు, వంచ మల్లారెడ్డి ,ఎండీ సలీం, పల్లె కమలాకర్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.