calender_icon.png 23 July, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహణ

22-07-2025 11:27:42 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బద్దుతండలో గల ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ లో మంగళవారం 108 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. సులానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కందుల దినేష్(Medical Officer Kandula Dinesh) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు సీజనల్ వ్యాధులు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, రక్తహీనత, సికెల్ సెల్ ఎనీమియా వ్యాధి లక్షణాలు దాని దుష్పరిమాణాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణవ, ఆరోగ్య విస్తరణాధికారి దేవా, ధరణి, స్వప్న, భవాని, కవిత, విజయ, తదితరులు పాల్గొన్నారు.