23-07-2025 12:00:00 AM
పి. వై. ఎల్. రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్
భద్రాద్రి కొత్తగూడెం, జులై 22 (విజయ క్రాంతి):ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీలను చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచలో జరిగిన పి వై ఎల్ జిల్లా స్థాయి సర్వసభ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూయువజనుల ప్రాధాన్యతో ఈ దేశ జాతీయోత్పత్తిని పెంచి, సగౌరవంగా నిలబెట్టా ల్సి న స్థితిలో గంజాయి, డ్రగ్స్, మత్తు పానీయాల తో యువతను ప్రభుత్వాలు ప్రేరేపిస్తున్నా యని ఆయన ధ్వజమెత్తారు. ఈ జనరల్ కౌన్సిలింగ్ సభకు అధ్యక్షులుగా ధారావత్ దేవా, పూ ణెం మంగయ్య, వ్యవహరించారు. .సమాజ మార్పులో,అభివృద్ధిలో అగ్రభాగాన నిలబడే యువతను ఈ దేశ పాలక వర్గలు విస్మరిస్తున్నా యన్నారు.
దేశ జనాభాలో 40 శాతానికి పైగా యు వతి,యువకులు ప్రాబల్యం కలిగి ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.యువకుల జీవితాలను నాశనం చేస్తున్న మ త్తు పదార్థాలను నిషేధించాలని డిమాండ్ చేశారు.
అనంతరం నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవ డం జరిగింది అధ్యక్ష కార్యదర్శులుగా పూనమ్ మంగయ్య ,కొరసా రామకృష్ణ ,ఉపాధ్యక్షులుగా సనప కుమార్, సహాయ కార్యదర్శిగా ఏనుగుల సతీష్, కోశాధికారిగా కుంజా అర్జున్, కమిటీ స భ్యులు బాడిషా లక్ష్మణరావు మూషిక లక్ష్మణ్ ఏనుగుల శాంతారావు వల్లోజీ చంద్రశేఖర్ బానోత్ జగదీష్ ను ఎన్నుకున్నారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పాల్వంచ డివిజన కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్,పార్టీ అనుబంధ సంఘం అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము, తదితరులు పాల్గొన్నారు.