21 August, 2026 | 9:48 PM

Breaking News

ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •  

కళాకారులను విస్మరిస్తున్న ప్రభుత్వం

21-08-2026 09:11 PM

జిల్లా అధ్యక్షుడు రాజేశం గౌడ్ 

ముస్తాబాద్,(విజయక్రాంతి): కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని  తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తీగల రాజేశం గౌడ్ పేర్కొన్నారు. ముస్తాబాద్  మండల అధ్యక్షుడు సుద్దాల దేవయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు గడుస్తున్నా  కళాకారుల జీవితాలు ఏమాత్రం మారలేదన్నారు. పేద కళాకారులకు, వృద్ధ కళాకారులకు పెన్షన్స్,బస్ పాసులు ఉచిత వైద్యం కోపం హెల్త్ కార్డ్ లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు పడకల ఇండ్లు,ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కళాకారులు ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడానికి పిలుపునిచ్చారు.  గత ప్రభుత్వంలో వేద కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించి సంక్షేమ కోసం అవకాశాలు కల్పించినా పూర్తిస్థాయిలో పేద కళాకారులకు  న్యాయం జరగలేదన్నారు. ఈ ప్రభుత్వంలో నైనా పేద కళాకారులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే పేద కళాకారులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేద కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు రాజమల్లు గౌడ్ బోయినిపల్లి మండల మండల అధ్యక్షుడు రవీందర్, నారాయణ, బాలరాజు, శంకర్, నారాయణ, గణేష్ గౌడ్, ఎండి సయుద్దిన్,ఎల్లయ్య, పెంటారెడ్డి, విష్ణు, భూమలింగం, మల్లయ్య, నర్సయ్య, అజయ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.