calender_icon.png 25 December, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయలేం

25-12-2025 12:53:55 AM

సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే డీజీపీ నియామకం ఉండాలి: హైకోర్టు

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చే సేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, డీజీపీ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. మాజీ డీజీపీ జితేందర్ స్థానంలో శివధర్‌రెడ్డి నియామకాన్ని లు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ, అర్హత కలిగిన ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి, రెండు వారాల్లోపు యూపీఎస్సీకి పం పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అనంత రం  పూర్తి వివరాలతో కౌం టర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచా రణను జనవరి 20కి వాయిదా వేసింది.