calender_icon.png 25 December, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడు నెలల బిల్లులు చెల్లించండి

25-12-2025 12:52:13 AM

మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్

నిర్మల్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల బిల్లులు చెల్లించాలని కోరుతూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించా రు. అనంతరం కలెక్టర్ ఏవోకు, డీఈవోకు వినతిపత్రాన్ని అందజేశారు.   ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొ మ్మెన సురేష్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం, మెస్ చార్జీలు, కోడిగు డ్ల బిల్లులు, గత ప్రభుత్వంలో చేపట్టిన అల్పాహారం బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరారు.

రాగిజావాకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలని కోరారు. ఈ ధర్నాలో తెలంగాణ మ ధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బోడు గోదావరి, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ రాజేశ్వరి, లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు సీహెచ్ లక్ష్మి, సునీత, మంగా, నాయకులు మంజుల, గంగామణి, రాజేశ్వరి, పద్మ పాల్గొన్నారు.