25-12-2025 01:04:43 AM
పాతనేరస్తులే నిందితులు
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 24 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్నవారే.. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ యథేచ్ఛగా పసికందుల విక్రయాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ రాకెట్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు.
మియాపూర్ పోలీసులు, శంషాబాద్ ఎస్‌ఓటీ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 11 మంది ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరి బారి నుంచి విక్రయానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు చిన్నారులను పోలీసులు కాపాడారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ రీతూ రాజ్ బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ ముఠా సభ్యులు పాత నేరస్తులే. గతం లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేంద్రంగా జరిగిన అక్రమాల్లో వీరు నిందితులుగా ఉన్నా రు. ఆ కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా వీరు తమ పద్ధతి మార్చుకోలేదు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చిన్నారుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గుజరాత్, తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో పేదరికా న్ని ఆసరాగా చేసుకుని, తల్లిదండ్రులకు డబ్బు ఆశచూపి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు.. అని డీసీపీ వివరించారు.
అహ్మదాబాద్ టు హైదరాబాద్
పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా సాగిస్తు న్న దందాకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌లో ని అహ్మదాబాద్ నుంచి మధ్యవర్తుల ద్వా రా ఇటీవల ఒక పసికందును కొనుగోలు చేశారు. విమానాలు, రైళ్ల ద్వారా పసికందును హైదరాబాద్ తరలించి, ఇక్కడ పిల్లలు లేని దంపతులకు రూ. 4 నుంచి 5 లక్షలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు.
అలాగే తెలంగాణలోని సిద్దిపేట జిల్లా రామన్నపేట తండాలో పేదరికం కారణంగా బిడ్డను పోషించుకోలేకపోతున్న తల్లిదండ్రులకు డబ్బు ఎరగా వేసి, వారి నుంచి మరో చిన్నారిని కొనుగోలు చేశారు. ఈ ఇద్దరు పిల్లలను కొనుగోలుదారులకు అప్పగించే ప్రక్రియ జరుగుతుండగా, పక్కా సమాచారంతో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీసీపీ తెలిపారు.
ప్రధాన నిందితుడిపై 18 కేసులు..
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకిపల్లి గంగాధర్ రెడ్డి (39). ప్రస్తుతం సికింద్రాబాద్ మె ట్టుగూడలో నివాసముంటున్న ఇతనిపై గతంలోనే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 18 కేసు లు నమోదయ్యాయి. కిడ్నాప్, జువైనల్ జస్టి స్ యాక్ట్, సరోగసీ చట్టం ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆరోపణలు ఇతనిపై ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు.
మరో కీలక నిందితుడు వేముల బాబు రెడ్డి (49) మేడ్చల్ దమ్మాయిగూడలో నివాసముంటూ ఐవీఎఫ్ ఏ జెంట్‌గా పనిచేస్తున్నాడు. ఫెర్టిలిటీ ఆసుపత్రులకు వచ్చే పిల్లలు లేని దంపతుల డేటాను సేకరించడం ఇతని పని. లీగల్ పద్ధతిలో ఆల స్యం అవుతుంది.. మా దగ్గర పిల్లలు ఉన్నా రు. లక్షలు ఇస్తే వెంటనే అరేంజ్ చేస్తాం అని నమ్మబలుకుతూ దందా నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు అరెస్టు చేసిన 11 మందిలో ఏడుగురు మహిళలే కా వడం గమనార్హం. పసిపిల్లలను రవాణా చేసేటప్పుడు పోలీసులకు, ప్రజలకు అనుమా నం రాకుండా ఉండేందుకు ఈ ముఠా మ హిళలను ఉపయోగించుకుంటోంది. వీరు పిల్లలను తమ సొంత బిడ్డల్లాగా నటిస్తూ రవాణా చేస్తారని డీసీపీ వెల్లడించారు.
శిశువిహార్‌కు చిన్నారులు..
రక్షించిన ఇద్దరు చిన్నారులను అమీర్‌పేటలోని శిశువిహార్‌కు తరలించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణ కేంద్రం లో ఉంచారు. పిల్లలను అమ్మినా, కొన్నా చట్టరీత్యా నేరమని, దత్తత కావాలనుకునే వారు చట్టబద్ధంగా వెళ్లాలని డీసీపీ రీతూ రాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అరెస్ట్ అయిన ముఠా సభ్యులు వీరే..
వి. గంగాధర్ రెడ్డి ,కీలక సూత్రధారి 18 కేసుల్లో నిందితుడు, వేముల బాబు రెడ్డి ,ఐవీఎఫ్ ఏజెంట్, డి. లక్ష్మి( భద్రాద్రి కొత్తగూడెం), రామ్ హరి రాయ్ (బీహార్), కుమ్మరి హర్ష రాయ్ (మూసాపేట్), సంగీ తా దేవి (జగద్గిరిగుట్ట), గుడెపు సుజాత (నారపలి)్ల, సురబోయిన అనురాధ (సికిం ద్రాబాద్), ఈసరపు జ్యోతి (బేగంపేట), వి. మాధవి (చింతల్), పోతుల శోభ (ముషీరాబాద్) తదితర సభ్యులు పట్టుబడ్డారు.