22 July, 2026 | 3:56 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు సంతోషకరం

17-07-2024 05:42 AM

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని తాను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని చెప్పారు.

ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని తాను ఎప్పటినుంచో చెప్తున్నాని గుర్తుచేశారు. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుకు, అధికారులు, సిబ్బందికి వెంకయ్య అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకపై అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షించారు.