వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి
రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బొమ్మకంటి కొమరయ్య
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జూన్ 4: వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని, అడవులు, భూములు, ఖనిజాలు, నీటి వనరులు, గుట్టలను కంపెనీలకు కట్టబెట్టే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోరాడాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బొమ్మకంటి కొమరయ్య పిలుపునిచ్చారు.
ఈనెల 9, 10 తేదీలలో హైదరాబాదులోని కాచిగూడ(తుల్జాభవన్)లో రెండు రోజుల పాటు నిర్వహించే రైతు కూలి సంఘం రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు బెల్లి నాగరాజు, గంగనబోయిన వీరాంజనేయులు, బోడ బాలస్వామి, పల్స గిరి, దడిపల్లి వెంకట్, మద్దెపురి సురేష్, ప్రవీణ్, లింగమల్లు తదితరులు పాల్గొన్నారు.






