5 June, 2026 | 2:34 AM

స్త్రీ శక్తి భవనానికి స్థలం విరాళం

05-06-2026 12:26 AM

ఆదర్శంగా నిలిచిన శూన్యపహాడ్ సర్పంచ్ నీమా నాయక్ 

పాలకవీడు, జూన్ 4: మండలంలోని శూన్య పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన స్థలం సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ రామావత్ నీమా నాయక్ కుటుంబం ఉదారంగా ముందుకొచ్చింది.

గ్రామంలో మహిళల సాధికారత కోసం నిర్మించనున్న స్త్రీ శక్తి భవనం, అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే ఇతర ప్రజా ఉపయోగ భవనాల నిర్మాణానికి స్థలం అవసరమని గుర్తించిన సర్పంచ్ రామావత్ నీమా నాయక్, అమ్మ రామావత్ కమిలి జ్ఞాపకార్థంగా సుమారు 20 కుంటల భూమి 7 లక్షలకు కొనుగోలు చేసి గ్రామానికి విరాళంగా అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నిమా నాయక్ మాట్లాడుతూ మా అమ్మ జ్ఞాపకార్థంగా ఈ స్థలాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం గ్రామ అభివృద్ధికి దోహదపడటంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాగా సర్పంచ్ నిమా నాయక్ ను పలువురు గ్రామస్తులు అభినందించారు.