3 April, 2026 | 3:16 AM

ప్రజల చెంతకు ప్రభుత్వ పథకాలు

03-04-2026 12:24 AM
  1. గ్రామసభల ద్వారా అవగాహన పెంపు
  2. నల్లగొండ గ్రామ సభలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి

మానకొండూరు, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి)రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వ హిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డా క్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. గురువారం తిమ్మాపూర్ మండలం నల్లగొం డ గ్రామంలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పరిపూర్ణ అవగాహన కల్పించాలన్నదే గ్రామసభల ప్రధానోద్దేశమని పేర్కొ న్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టని అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్నామన్నారు. ఈ గ్రామ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను గురించి వాస్తవాలను మాత్రమే ప్రజ లకు వివరిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అ మలు చేస్తున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్ర యాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోపస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ జారీ,  కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు, వాటి ద్వారా చేకూరుతున్న లబ్ధి గు రించి ఆయన ప్రజలకు వివరించారు. అలా గే త్వరలో కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇం టర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం, అల్పాహారం వంటి తదితర పథకాల ద్వారా మరింత మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధిని కాంక్షిస్తూ పథకాలను అమ లు చేస్తున్నదని, ఆయా పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు.అంతే కాకుండా ఇప్పటి వరకు మూడు పర్యాయాలు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ వారి సొంతింటి కలలను సాకారం చేస్తున్నామన్నారు.

నివేశన స్థలాలు లేని వారికి ప్రభుత్వపరంగా స్థలాలు ఇస్తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులును చేయాలన్న రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరానికి గ్రామ సభలు తోడ్పడతాయన్నారు. సమస్యల పరిష్కారానికి ఇవి వేదికవుతాయన్నారు.

గ్రామసభల్లో అన్ని ప్రభుత్వశాఖలు ప్రగతి వివరాలు వెల్లడించడం ద్వారా ప్రజలకు పథకాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఫలితంగా ప్రభుత్వ పథకాల ద్వారా మరింత లబ్ధిపొందేందుకు వీలు కలుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని, అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆమె కోరారు. అంతకు ముందు నల్లగొండ గ్రామానికి సంబంధించి వివిధ శాఖల ద్వారా చేపట్టి అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, నల్లగొండ గ్రామ సర్పంచ్ జింక మారుతి, మండల తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఉప అధికారి డాక్టర్ రాజగోపాల్,ట్రాన్స్ కో కార్యనిర్వాహక ఇంజినీర్ ఎండీ ఖాసిం, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, ఐసీడీఎస్ అధికారులు శ్రీలత, ఫర్వీన్, ఎంపీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.