3 April, 2026 | 3:11 AM

నైపుణ్యత ఉంటే ఎక్కడైనా సముచిత స్థానమే

03-04-2026 12:25 AM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మనలో నైపుణ్యత ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా సముచిత స్థానమే వారికి ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని మెట్టు గడ్డలో ఉన్న ఎటిసి సెంటర్ ను, వైభవంగా ధర్మాపూర్లో శ్రీ కాపీలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలలో, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో, 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎటిసి సెంటర్లో శిక్షణ విధానం, వసతులు తదితర అంశాలపై వివరంగా తెలుసుకున్నారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో నైపుణ్యాలు (స్కిల్స్) కలిగిన వారికి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

ఎటిసి సెంటర్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు వెంటనే ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ 5 లక్షల భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమాల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, శ్రీరామ జయరామ మోటార్స్ ఎండీ బెక్కెరి రామిరెడ్డి, మారుతి కార్స్ సిఇఓ విక్రం యాదవ్, ఎటిసి సెంటర్ ప్రిన్సిపాల్ గోపాల్ నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.