calender_icon.png 15 November, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల.. సమస్యలు తీరేదెలా..?

15-11-2025 12:29:50 AM

  1. రాంపురం తండా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు తిష్ట

పట్టించుకోని అధికారులు  విద్యార్థులకు తప్పని తిప్పలు

వసతులు కల్పించాలని  వేడుకోలు

మోతె, నవంబర్ 11 : విద్యార్థుల జీవితాలకు బంగారు బాటలు వేయాలనే సంకల్పం తో ప్రభుత్వాలు పాఠశాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా గుణాత్మకమైన విద్యంజ్ అందజేస్తున్నాయి. అయితే వీటి నిర్వాహణలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుకారిపోతుంది. దీనికి మంచి ఉధాహరణ మండల పరిధిలోని రాంపురంతండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.          

శిధిలావస్థలో పాఠశాల భవనం..

రామాపురం తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవనం పైకప్పు పెచ్చులూడి పోవడంతో వర్షపు నీరు లీక్ అవుతుంది. అలాగే గోడలు దెబ్బతినడం, నేల మొత్తం బురదగా మారిపోవడం తో పిల్లలు తరగతి గదుల్లో కూర్చోవడమే కష్టంగా మారింది.  

సమస్యల తిష్ట..

పాఠశాలకు ప్రహరీ గోడ  లేకపోవడం వల్ల పశువులు, కుక్కలు పాఠశాల ప్రాంగణంలోకి వస్తున్నాయి. దీని వలన పిల్లల భద్రతకు ప్రమాదం ఏర్పడుతోందని, పాఠశాల ఆవరణలో శుభ్రత లేకుండా పోయిందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. విద్యార్థులు సురక్షితంగా చదువుకునే వాతావర ణం కోసం ప్రహరీ గోడ నిర్మాణం అత్యవసరమని వారు పేర్కొన్నారు.

పాఠశాలకు పంపేందుకు వెనుకాడు తున్న తల్లిదండ్రులు..ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు భయంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి వెనుకాడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడానికి స్థోమత లేకపోయినా తప్పని పరిస్థితిలో పంపాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ ప్రజలు మండల విద్యా అధికారి, ఇతర అధికారులకు పలు మార్లు వినిపించినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులే చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి పాఠశాల భవనాన్ని మరమ్మత్తు చేసి, ప్రహరీ గోడ నిర్మించి, మెరుగైన వసతులు కల్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.    బడికి రావాలంటే భయమేస్తుంది.

చుట్టు గోడ లేదు

పాఠశాల బడికి చుట్టు గోడ లేదు. కుక్కలు, బర్రెలు వస్తున్నాయి. బడికి రావాలంటేనే మాకు భయం అవుతుంది. అవి తిరిగిన చోట మేము కూసోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

సహస్ర, పాఠశాల విద్యార్థి,  రాంపురంతండ 

ఎంపీడీవో కి ఇప్పటికే చెప్పాము

పాఠశాలలో ప్రహరీ గురించి ఎంపీడీవో కి ఇప్పటికే చెప్పాము. అలాగే అక్కడ నెలకొన్న సమస్యల గురించి సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. విద్యార్థులందరికీ గుణాత్మకమైన విద్య అందించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం.

లింగయ్య, హెచ్ ఎం, రాంపురం తండా పాఠశాల.