calender_icon.png 15 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవింగ్‌లో అప్రమత్తత అవసరం

15-11-2025 12:08:11 AM

-హత్యల కన్నా పది రెట్లు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు : డీజీపీ శివధర్‌రెడ్డి

-‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ  

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి):ప్రతి ప్రాణం విలువైంది.. మీకోసం ఇంట్లో ఎదురుచూసే కుటుంబం ఉంది.. జాగ్రత్తగా వెళ్లి, క్షేమంగా తిరిగి రండి ఈ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తెలంగాణ పోలీసులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ రక్షణాత్మక డ్రైవింగ్ తారక మంత్రమని డీజీపీ బీ శివధర్‌రెడ్డి అన్నారు. పరిసరాలను గమనిస్తూ, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలకు చెక్‌పెట్టవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడి యంలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో సంవత్సరానికి హత్య ల ద్వారా సుమారు 800 మంది చనిపోతే, దానికి పది రెట్లు, అంటే దాదాపు 8,000 మంది రోడ్డు ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అత్యంత తీవ్రమైన సమస్య. ఈ అవగాహన కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిసామని తెలి పారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా సగటున 3 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 300 మంది మరణిస్తున్నా రు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నా రు.

గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపులో హైదరాబాద్ పోలీసులు దేశానికే ఆద ర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రమాదం జరిగినప్పుడు మీరు కూడా స్పందించి సహా యం చేయండి అని పిలుపు నిచ్చారు. ప్ర ముఖ సినీనటుడు బాబూమోహన్ తన కు మారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన విషాదాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 

సినీ ప్రముఖులు శర్వానంద్, ఆది సాయికుమార్, దర్శకుడు బుచ్చిబాబు తదితరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను చెప్పారు. ఇండియా గాట్ టాలెంట్ ముంబై అక్రోబాట్ బృందం నృ త్య ప్రదర్శన ఆహూతులను అలరించింది.  కార్యక్రమంలో ఐజీలు రమే ష్, రమేష్ రెడ్డి, అదనపు సీపీ శ్రీనివాసులు, జాయింట్ సీపీ జోయల్ డెవిస్, పలువురు డీసీపీలు, వైద్యు లు, కళాకారులు పాల్గొన్నారు.