calender_icon.png 15 November, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాంతం పెంచేశారు!

15-11-2025 12:45:37 AM

  1. పెరిగిన వరి కోతల ధరలు

ఆగం అవుతున్నఅన్నదాతలు

కరీంనగర్, నవంబర్14(విజయక్రాంతి): అన్నదాతలు నాటు నుండి కోత వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న వరి చేతికొచ్చే దశలో ’ముంథా’ తుఫానుముంచగా, తడిసిన వరి చెనులు ఎండకు ఎండిన అనం తరం కొద్దామంటేహార్వెస్టర్ల మోత మోయలేని భారంగా మారింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో లక్షలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి బురదమయంగా మారింది.

దీంతో సాధారణ టైర్ల హార్వెస్టర్లతో కోతలు సాధ్యం కాక, అత్యధిక అద్దె చెల్లించి చైన్ కంపెనీబెల్టు హా ర్వెస్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటిని ఆంధ్రా నుండి అద్దెకి తెస్తు న్నారు. ఒకవైపు రాలిన ధాన్యంతో నష్టం.. మరోవైపు అదనపు కోత ఖర్చుతో పెట్టుబడి కూడా రాని దయనీయ స్థితిలో రైతులు ఉ న్నారు.కరీంనఫర్ జిల్లాలో వరి పంట 2.లక్షల ఎకరాల్లో సాగైంది.

పెద్దపల్లి జిల్లాలో 2.లక్షల ఎకరాల్లో , జగిత్యాల జిల్లాలో 3లక్షల ఎకరాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో 1.80లక్షల ఎకరాల్లో సాగైం ది. కోత ఆలస్యం కావడంతో హార్వెస్టర్ వాడ కం తప్పనిసరి అయింది. టైర్ల హార్వెస్టర్ కిరా యి గంటకు రూ.2,600 నుంచి రూ.2,800 వరకు ఉంటుంది, కానీ, తుఫాను కారణంగా పొలాలు బురదమయం కావడంతో..

బురదలో కూడా పనిచేసే చైన్ హార్వెస్టర్లకు డి మాండ్ విపరీతంగా పెరిగింది. ఇదే అదునుగా యంత్రాల నిర్వాహకులు గంటకు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఎకరం వరి కోయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే సాధారణం గా టైర్ హార్వెస్టర్ అయితే గంటకు రూ. 2800 చొప్పున రూ.5600 ఖర్చు వస్తుంది.

ప్రస్తుత చైన్ హార్వెస్టర్ కారణంగా గంటలకు రూ.3,500 చొప్పున ఎకరాన రూ.7వేల ఖర్చు వస్తోంది. దీంతో రైతుపై రూ.14వేల వరకు అదనపు భారం పడుతోంది. అందులోనూ వరి కోతకు గిరాకీ పెరగడంతో చైన్ హార్వెస్టర్లు దొరకడం గగనమైంది. అడ్వాన్స్ ఇస్తామన్నా యంత్రాలు అందుబాటులో లేక ఆంధ్రా నుండి అద్దెకు తెచ్చుకుంటున్నారు. పంటను చైన్ మిషన్తో కోయడం వల్ల పశుగ్రాసం కూడా పూర్తిగా బురదలో కూరుకుపోయి వధా అవుతోంది. 

ధాన్యం కోల్పోవడంతో పాటు పశుగ్రాసం కూడా దక్కకపోవడంతో పశువులు న్న రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.. అప్పు చేసి పంటలు సాగు చేస్తే.. చివరకు అదనపు ఖర్చులు, ధాన్యం నష్టంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రకతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్ట పరిహారంతో పాటు అదనపు కోత ఖర్చును భరించి అండగా నిలబడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

వరి కోత యంత్రాలు దొరకడం లేదు -

అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికదే సమయానికి తు ఫాను ప్రభావితంతో చాలా నష్టం వచ్చిం ది.వాగు పక్కకు పొలం ఉండడంతో. వరి పంట కోసేందుకు మిషన్లు రాకపోవడంతో భూమి అరెంతవరకు వెయిట్ చేసి వరి కోపిస్తున్నాము. యంత్రాల ధర పెంచారు.

ప్ర భుత్వం గిట్టుబాటు కల్పించడం అని ఆందోళన చెందుతున్నాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తానని చె ప్పి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అం దించలేదు. ప్రభుత్వం సన్న రకాలు పెట్టమంటున్నారే తప్ప ఇప్పటివరకు న్యా యం చేసింది ఏమీ లేదు. పంట నష్టం వేసారే తప్ప రైతులకు నష్టపరిహారంఇచ్చిందిలేదు.

దరుగుల కుమార్ రైతు కనగర్తి గ్రామం ఇల్లంతకుంట మండలం