15 April, 2026 | 1:41 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

ప్రభుత్వ విద్యాలయాలు.. అభివృద్ధికి హేతువులు

25-02-2026 06:14 PM

పేద విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయం

జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాలయాలు విద్యార్థుల అభివృద్ధికి హేతువులని పేద విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయమని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరీక్ష గణితులను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రభుత్వ విద్యాలయాలు విద్యార్థుల అభివృద్ధికి హేతువులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యంతో పాటు మెలుకువలు  పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు, నైపుణ్య శిక్షణతో విద్యను అందిస్తారని నైపుణ్యాభివృద్ధికి ఉపాధ్యాయులు పెద్దపీట వేస్తారన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే అభ్యసనం ఉత్తమంగా తీర్చిదిద్ద బడుతుందని తెలిపారు.

అనంతరం పాఠశాలలోని 150 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆణిముత్యాల పేరిట పదివేల రూపాయలు నగదు బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శెట్టి మహేష్ గుప్తా, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కోట శ్రీనాథ్ గుప్తా, గడ్డమీద విజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాజా మొయినుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.