15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

108 అంబులెన్స్ పైలెట్లకు ‘స్టార్ పైలెట్’ పురస్కారం

25-02-2026 06:10 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని లింగాపూర్, సిర్పూర్ (యు), జైనూర్ మండల కేంద్రాల్లో 108, 102 అంబులెన్స్‌లలో పైలెట్లుగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ జగదీష్, జ్ఞానేశ్వర్, రవి, గజానంద్‌లకు జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ నుంచి ‘స్టార్ పైలెట్’ పురస్కారం లభించింది. గత ఆరు నెలలుగా అత్యవసర సేవల్లో నిబద్ధతతో పనిచేస్తూ, సమయానికి రోగులను ఆసుపత్రులకు తరలించడం, కిలోమీటర్ల పనితీరు మెరుగ్గా ఉండటం, లబ్ధిదారులకు సరైన వైద్య సంరక్షణ అందించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడినందుకు వీరి సేవలను గుర్తించి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ కె. హరిత,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీతారాం చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల 108 సేవల కార్యక్రమ నిర్వాహకుడు సామ్రాట్,ఆసిఫాబాద్ జిల్లా 108 సేవల నిర్వాహకుడు మెరుగు నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.