17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

'బాలలందరికీ న్యాయం' పోస్టర్ ఆవిష్కరణ

25-02-2026 06:19 PM

చేగుంట,(విజయక్రాంతి): ​చేగుంట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో విజన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన బాలలందరికీ న్యాయం, అవగాహన పోస్టర్‌ను ఎమ్మార్వో శివప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మహిళాలో, శిశు సంక్షేమ శాఖ సహకారంతో బాల్య వివాహాల నిరోధం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ బాలల హక్కుల రక్షణ మనందరి బాధ్యత అని, బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో విజన్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.