6 July, 2026 | 2:09 AM

సమస్యలతో కునారిల్లుతున్న ప్రభుత్వ బడులు

06-07-2026 01:04 AM
  1. పెచ్చులు ఊడుతున్న స్లాబ్ లు
  2. పలు పాఠశాలలో పూర్తికాని గదులు, నీటి ట్యాంకులు

(అశ్వారావుపేట, జూలై 5, (విజయక్రాంతి):  ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు  వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పాఠశాలల్లో మాత్రం పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక వి ద్యార్థులు ఇబ్బందులు వడుతున్నారు. సెలవుల అనంతరం పాఠశాలలు చిన్నారులకు సమస్యలతోనే స్వాగతం పలుకుతున్నాయి. అశ్వారావుపేట మం డలంలో 94 పాఠశాలలు ఉండగా గిరిజన సంక్షేమ విభాగం పాఠశాలలు మినహాయిస్తే 58 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఆరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

మండలంలోని వండువారిగూడెం, మద్దికొండ పాఠశాలలు కొన్ని గదులు శిధిల దశకు చేరుకున్నాయి. మద్దికొండ లో గదుల స్లాబు పెచ్చుపెచ్చులుగా ఊడిపోతుంది. ఈరెండు పాఠశాలలకు అదనపు గదులు అవసరం. దాదాపుగా అన్ని పాఠశాలల్లో ఏదో ఒక రూపం ‘లో తాగునీటి వసతి ఉంది మండలంలో ఏడు పాఠశాలలకు మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు కాగా రెండు పాఠశాలల్లో పూర్తి కాగా మరో రెండు పాఠశాలల్లో పనులు సాగుతున్నాయి.

అనేక పాఠశాలల్లో వంటషెడ్లు లేకపోవటంతో ఆరుబయటనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఉంది. పాఠశా లలకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవటంతో ఇబ్బందులు తప్పటం లేదు. మండలంలో దాదాపు 15 ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి.

ఉన్నత పాఠ శాలల్లోనూ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవటంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువులు అందటం లేదు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.. దమ్మపేట మండలంలో... మండలంలో 103 ప్రాథమిక పాఠశాలలు. 8 జడ్పీ పాఠశాలలు ఉన్నాయి. 20 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. మందలపల్లి ప్రకాష్ నగర్ పాఠశాలలో చెట్టు కూలి ప్రహరీ గోడ కూలిపోయింది. దాన్ని పట్టించుకున్న నాధుడు లేడు.

ములకలపల్లిలో...

ములకలపల్లి ప్రాధమిక పాఠశాల అధ్వాన్నంగా ఉంది. వంట . షెడుకు తలుపులు లేవు. అసంపూర్తిగ ఉన్న మరుగుదొడ్లు. మంచినీళ్ళ ట్యాంకు నుండి నీరు లీకై మురుగు కాలవలా మారింది సెప్టిక్ ట్యాంకు పగిలి దుర్వాసన వెదజల్లుతుంది. 

చండ్రుగొండలో.. 

చండ్రుగొండు  మండలం లో పోకలగూడెం. రేపల్లెవాడు, మద్దు కూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, వంటశాలలు, వాటర్ ట్యాంక్ నిర్మాణాలు మద్యలోనే  నిలిసిపోయాయి. గత రెండు సంవత్సరాల క్రితం నిర్మాణాలు ప్రారంభించి నేటికి పూర్తి కాకపోవటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలల పరిస్థితి చెప్పనవసరం లేదు. అత్యధిక పాఠశాలల్లో మూత్రశాలు వినియోగానికే పనికిరావు.

కవేళ ఉన్నా నీటి కనక్షన్లు లేవు. ఇటువంటి పాఠశాలలకు తమ పిల్లలును ఎలా  పంపాలని తల్లిందండ్రులు అధికారులను ప్రశ్నస్తున్నారు. దీంతో పాటు పలు పాఠశాలల్లోని వంటశాలల్లోకి కొద్దిపాటి వర్గానికే నీరు చేరుతుంది. అదేవిదంగా విద్యుత్ పైపులు, వైర్లు  అడ్డగోలుగా వేలాడుతున్నాయి. మరి కొన్ని పాఠశాలోని తరగతి గదుల స్లాబుల నుంచి వర్షం నీరు లీకు అవుతుంది. అన్ని సమస్యల నడుమ విద్యార్థులకు విద్యాబోదన చేయటం కష్టసాధ్యంగా ఉందని  పలువురు  ఉపాద్యాయలు వాపోతున్నారు.