మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తా
కోదాడ ఏప్రిల్ 29: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో కోదాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. బుధవారం పట్టణంలోని 20వ వార్డులో కల్వర్టును ప్రారంభించి మాట్లాడారు. అనంతరం 31వ వార్డులో బొమ్మరిల్లు అపార్ట్మెంట్ వద్ద నిర్వహించిన ప్రజాపాలనలో మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి మునిసిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.
అనంతరం బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత వాలీబాల్ శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్ గురవమ్మ సైది బాబు,,ఎంఈఓ సలీం షరీఫ్,నాయకులు భద్రా రెడ్డి, జూలూరి వీరభద్రం, చిలుముల వెంకటేష్ , పంది కళ్యాణ్ బాబు , చిన్న మారుతి శ్రీను , నాగుల మీరా తదితరులు పాల్గొన్నారు.






