2 June, 2026 | 5:18 PM

పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

02-06-2026 04:19 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కుచ్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరా మైండ్లో గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని దృక్పథంతో ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ గృహనిర్మాణ శాఖ డిఏతో పాటు గ్రామ సర్పంచ్ మైలి నారాయణ కార్యదర్శి అశోక్ కుమార్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.