గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రజా పాలన ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, అందుకు అనుగుణంగా నిధులను విడుదల చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు ఆదివాసి సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.ముందుగా సర్పంచ్ ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.సర్పంచ్ ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించి గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.నీటి ఎద్దడి లేకుండా చూడాలని,అలాగే వర్ష కాలంలో గాలి, వాన,పిడుగుల పట్ల రైతులు పంట పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో మారుమూల గిరిజన గ్రామాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని గుర్తు చేశారు.జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ విశ్వనాథ్ , ఉట్నూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
* ఉట్నూర్ కేజీబీవి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ..
ఉట్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు,త్వరతిగతిన నాణ్యతతో తరగతి గదులు నిర్మించాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాలలు,ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
*సాలెవాడ బి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే...
ఉట్నూర్ మండలం సాలెవాడ బి ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి,బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తుంది అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.రోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి వెంటనే మంజూరు ఇవ్వాలని పీఆర్ ఏఈ ని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. సంక్షేమ పథకాలు గుర్తించి ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






