12 June, 2026 | 5:49 PM

వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన

12-06-2026 04:39 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రైతు విభాగ కేంద్రం మాల్తుమ్మెదలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపన దినోత్సవం జరుపుకోవడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ జెకె రేవంత్ నాథన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే బోధన, పరిశోధన,విస్తరణ సేవల గురించి వివరించారు. అలాగే ఇస్రో ప్రతినిధి విష్ణు మాట్లాడుతూ... నానో యూరియా,నానో డిఏపి మరియు డ్రోన్ల వాడకం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో మాల్తుమ్మెద  గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు,మరియు గోపాల్పేట్,చినూర్,మాల్తుమ్మెద రైతులు పాల్గొన్నారు.