30 July, 2026 | 8:08 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు

23-02-2026 12:28 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

వేములవాడ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కోనాయపల్లిలో  ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు స్థిర నివాసం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, అభివృద్ధి పథంలో వేములవాడ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్,స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.