30 July, 2026 | 9:05 PM

Breaking News

భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •   ఉట్నూర్ లోని ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే..   •   పరవళ్లు తొక్కుతున్న గుండారం రిజర్వాయర్ మత్తడి   •   విద్యుత్‌ సరఫరాలో మునుగోడును రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలి   •   అంగన్వాడీ టీచర్లు, ఆయాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి   •   ఘనంగా సోనుసూద్ జన్మదిన వేడుకలు: బలగం శ్రీధర్   •   టి జేఏసీ జిల్లా చైర్మన్‌కు రంగానాయక్ కుటుంబం అభినందనలు   •   భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి   •   ఉమ్మడి జిల్లా డైరెక్టర్ హీనా బేగంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి సన్మానం   •  

అద్భుతమైన శిల్పసంపద కోటగుళ్లు

23-02-2026 12:29 AM

ఇంగ్లండ్ దేశస్థులు సిమన్, వాలేరీ

గణపురం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కోటగుళ్ళు శిల్ప సంపద అద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరీ లు అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను చరిత్ర ను రామప్ప గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఆలయ శిల్ప సంపదను ఫోటోలు వీడియోలు చిత్రీకరించుకున్నారు.