29 August, 2026 | 5:23 PM

కొత్త హనుమాన్ స్వామి జాతరలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

29-08-2026 03:46 PM

చందుర్తి, ఆగష్టు 29,(విజయక్రాంతి): మండల కేంద్రంలో శ్రావణమాసం సందర్భంగా నిర్వహించిన కొత్త హనుమాన్ స్వామివారి జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలంతా స్వామివారి కృపతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అలాగే సాధుసజ్జన భజన మండలి వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.