29 August, 2026 | 6:08 PM

సిపిఎం సానుభూతిపరుడు చెరుకుపల్లి వీరస్వామి మృతి

29-08-2026 05:03 PM

సిపిఎం పార్టీకి తీరనిలోటు

నివాళులర్పించిన సిపిఎం 

పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్

కూసుమంచి, (విజయక్రాంతి): సిపిఎం  సానుభూతిపరుడు చెరుకుపల్లి వీరస్వామి(90) మృతి సిపిఎం పార్టీకి తీరనిలోటని సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ తెలిపారు. . మండలంలోని మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం  సిపిఎం సానుభూతిపరుడు  చెరుకుపల్లి వీరస్వామి మృతి చెందిన విషయం తెలుసుకొన్న సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్  శనివారం మల్లెపల్లి గ్రామానికి చేరుకొని వీరస్వామి మృతదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఎం పార్టీకి ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లెల సన్మానరావు, మండల కార్యదర్శి తోటకూర రాజశేఖర్, గ్రామ శాఖ కార్యదర్శి చీర్ల రాధాకృష్ణ, శాఖ సభ్యులు, పార్టీ సానుభూతిపరులు పాల్గొని నివాళులర్పించారు