29 August, 2026 | 5:42 PM

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

29-08-2026 05:09 PM

ఎంన్సిపిఐయు నిర్మల్ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు కొరతలు తీర్చాలని ఎంసిపిఐయు నిర్మల్ జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్, సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, సభ్యులు పి.స్వరూప డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఖానాపూర్ లో విద్యాశాఖాధికారి కి పిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో 80 శాతం పాఠశాలల్లో అనుభవం లేని టీచర్ లు, బాత్రూంలు, ఆటస్థలాలు, ఫ్యాన్లు, సరైన వసతులు లేక పాఠశాలలు నడిపిస్తున్నారని వాటికి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ  ప్రైవేటు ,ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.