6 April, 2026 | 2:58 PM

కార్యకర్తలకు ప్రభుత్వ విప్ పరామర్శ

14-05-2024 02:19 AM

రాజన్న సిరిసిల్ల, మే 13 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్ట ణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఫిరోజ్, ఇంతియాజ్ తమపై పోలీసులు దాడి చేశా రని ఆరోపించారు. ఆదివారం రాత్రి తమ ఇంటిముందు కూర్చొని ఉండగా.. పోలీ సులు వచ్చి ఎలాంటి ప్రశ్నలు అడగకుం డానే దాడి చేశారని పేర్కొన్నారు. కాగా, బాధితులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం పరామర్శించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు వారిని ఫోన్‌లో పరామర్శించారు.