భారతీయ జనతా పార్టీ ఎందరో మహనీయుల ప్రాణాల త్యాగంతో ఏర్పడింది
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన బిజెపి మండల అధ్యక్షుడు శ్రీనివాస్. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ...భారతీయ జనతా పార్టీ ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిందని ఏకాత్మక మానవతా సిద్ధాంతానికి కట్టుబడి అంత్యోదయ చిట్టచివరి వ్యక్తికి ప్రతిఫలాలు అందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందనన్నారు.
నేషన్ ఫస్ట్,పార్టీ నెక్స్ట్,సెల్ఫ్ లాస్ట్, అనే సిద్ధాంతంతో పార్టీ ఆవిర్భవించడం జరిగిందని తెలియజేశారు.పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ,శ్యామ ప్రసాద్ ముఖర్జీ,అటల్ బిహారి వాజ్పేయి,లాల్ కృష్ణ అద్వానీ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధుడై పార్టీని క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించడం జరిగింది.మండలంలోని 32 బూత్లలో పార్టీ జెండాలను బూత్ అధ్యక్షులు ఆవిష్కరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమాన్లు,మాజీ ఎంపీటీసీ బోయిని బాలయ్య,మండల ప్రధాన కార్యదర్శి మేకల కిషన్,నాయకులు మీరాతాయి,గోపాల్, అంజయ్య,సిద్ధి రాములు, రాజు,యాదగిరి,రాములు లవన్ కుమార్,లింగం, నాగరాజు గౌడ్,విజయ్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.




