6 April, 2026 | 1:01 PM

ఆర్టీసీ ‘స్పెషల్’ బాదుడు

14-05-2024 02:20 AM

ప్రత్యేక బస్సుల పేర టికెట్ ధర పెంపు

ఎన్నికల వేళ అవాక్కైన ప్రయాణికులు 

మహబూబ్‌నగర్, మే 13 (విజయక్రాంతి): ఎన్నికల వేళ ఆర్టీసీ ప్రయాణికులను ‘స్పెషల్’ ధరలతో అవాక్కయేలా చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బస్కెక్కిన ప్రజలకు కండక్టర్లు టికెట్ ధరలతో చెమటలు పట్టించారు. ఎన్నికల కోసం హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని చెప్పడంతోపాటు టికెట్ ధర సైతం రూ.౨౩౦ వసూలు చేశారు. స్పెషల్ బస్సుల పేరుతో దోపిడీపై ప్రయాణికులు ఆర్టీసీపై మండిపడుతున్నారు. ఓటు వేసేందుకు వెళ్లే వారిపై అదనపు చార్జీ వసూలు చేయడమేంటని నిలదీశారు. టికెట్ ధర చెల్లించాల్సిందేనని ఆర్టీసీ సిబ్బంది స్పష్టంచేయ డంతో చేసేది లేక ప్రత్యేక చార్జీలు చెల్లించి ఓటర్లు తమ ప్రయాణాలను కొనసాగించారు.