6 April, 2026 | 3:22 PM

రాఘవపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

06-04-2026 01:23 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం లోని రాఘవపేట గ్రామం లో లబ్ధిదారుడైన కుంచపు రాములు ఇందిరామ్మా ఇల్లు గృహప్రవేశం జరిగింది. కుటుంబ సభ్యులు ఈ సంతోషకర క్షణాన్ని హర్షాతిరేకంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కళ నెరవేరిందని ఇందుకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికి ఋణపడి ఉంటామని తెలిపారు. ఇల్లు మంజూరు కావడానికి సహకరించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,కృష్ణారావు, రాఘవపేట కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.