17 April, 2026 | 9:29 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

రోడ్డు విస్తరణ పనులపై ప్రజలతో చర్చించిన ప్రభుత్వ విప్

19-04-2025 12:01 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనుల గురించి ప్రజలతో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ శుక్రవారం చర్చించారు. మరిపెడ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు జిన్నా లచ్చయ్యను ప్రభుత్వ విప్ పరామర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 5 వేల రూపాయలను లచ్చయ్యకు సహాయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, అఫ్జల్ గండి రమేష్, మరిపెడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్ పాషా, ప్రధాన కార్యదర్శి రాంపల్లి వీరాంజి, బోడ పట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.