calender_icon.png 6 December, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి అశోక్ నివాసంలో అయ్యప్ప శరణు ఘోష

06-12-2025 04:48:55 PM

ముఖ్య అతిథులుగా గూడెం మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్, సురేందర్ గౌడ్

జిన్నారం: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామం అంబేద్కర్ కాలనీలో మంత్రి అశోక్, కన్నయ్య ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మాదారం అంబేద్కర్ కాలనీ మార్మోగింది. సత్యనారాయణ, వినోద్ గురుస్వాములు అర్చకులు 18 మెట్ల పూజ, ‌గణపతి, కుమారస్వామికి అభిషేకం, అర్చనలు చేశారు. మహ పడిపూజ మహోత్సవానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప శరణు ఘోషతో మంత్రి నివాసం దద్దరిల్లింది. ఆద్యంతం అయ్యప్పను కొలుస్తూ ఉర్రూతలూగించారు.

నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన స్వాములను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాళ్లని ఘనంగా స్వాగతించి, సత్కరించిన మంత్రి అశోక్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... అయ్యప్ప మాలధారణ పవిత్రంగా మారుతుందని, మానవ జీవితం భక్తి మార్గంతో సమాజానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం మంత్రి అశోక్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాం చేయటం అభినందనీయమని, ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాలనీవాసులు, భక్తులు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.